హోమ్>carboxymethylcellulose
Carboxymethylcellulose
Carboxymethylcellulose గురించి సమాచారం
ఎలా Carboxymethylcellulose పనిచేస్తుంది
Carboxymethylcellulose కృత్రిమ కన్నీరుగా పనిచేస్తుంది. ఇది కన్నీటి మాదిరిగానే కనుగుడ్డు మీద తేమను అందిస్తుంది.
కంటి చుక్కల రూపంలో ఉండే కార్బాక్సీమిథైల్ సెల్యులోజ్ అనేది కంటి కందెనలు లేదా కృత్రిమ కన్నీళ్లు అనే ఔషధ తరగతికి చెందినది. ఇది కంటి ఉపరితలానికి తడిని మరియు కందెనతత్వాన్ని అందించడం ద్వారా పొడిదనాన్ని మరియు చికాకును తగ్గిస్తుంది. దీని చిక్కదనం కారణంగా, ఇది కంటిలో ఎక్కువసేపు నిలిచి ఉండి ఉపశమనాన్ని అందిస్తుంది.
Common side effects of Carboxymethylcellulose
కళ్ళు మంట, కళ్లు సలపడం, కంటిలో అలర్జిక్ రియాక్షన్
Carboxymethylcellulose మెడిసిన్ అందుబాటు కోసం
Carboxymethylcellulose నిపుణుల సలహా
- మీకు కంటి నెప్పి, తలనెప్పి పెరిగినా, చూపు మందగించినా లేక కంటి ఎరుపు లేక కంటి రేపుదల ఇబ్బందికరంగా మారినా,వైద్యుని వెంటనే సంప్రదించండి.
- కార్బోక్సీమిథైల్సెల్యులోస్ కంటి చుక్కలు వాడే 15 నిమిషాలు ముందుగా మాత్రమే యితర కంటి చుక్కలు లేక యితర మందులు వాడాలి.
- కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడే ముందు మీ కాంటాక్ట్ లెన్స్ తీసేయ్యండి. మళ్ళీ 15 నిమిషాల తర్వాత వాటిని ధరించండి.
- కార్బోక్సీమిథైల్సెల్యులోస్ కంటి చుక్కలు కంట్లో వేసేందుకు మాత్రమె ఉద్దేశించ బడినవి.
- కాలుష్యాన్ని అరికట్టాలంటే, కంటి చుక్కల సీసా కోనతో కంటి రెప్పలు మరియు యితర చుట్టుపక్కల ప్రదేశాలని తాకవద్దు.
- కంటి చుక్కల మందు రంగు మారినా లేక సీసా అస్పష్టంగా ఉన్నా, ఆ మందు వాడ వద్దు; ఒక సారి మాత్రమె వాడవలసిన సీసాల విషయంలో ఆ సీసా చెక్కు చెదరకుండా ఉంటేనే వాడండి. అలాగే, మూత తీసిన వెంటనే మందుని వాడేయ్యండి.కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడిన తరువాత చూపు విషయం లో కొంత అస్పష్టత వుంటుంది. కాబట్టి, చూపు సరిగా అయ్యేంత వరకు వేచి వుండి, తర్వాత మాత్రమె డ్రైవింగ్ చేయడం లేక యంత్రాలు నడపటం చేయడం వంటివి చేయండి.
- మీరు గర్భవతి అయినా, గర్భ ధారణ ప్రయత్నాలలో ఉన్నా, చను బాలు ఇస్తున్నా,కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడే ముందువైద్యుని సంప్రదించండి.