హోమ్>ambroxol
Ambroxol
Ambroxol గురించి సమాచారం
ఎలా Ambroxol పనిచేస్తుంది
Ambroxol ముక్కు, గొంతు భాగాలలో పేరుకున్న శ్లేష్మం పలుచబడేలా చేసి దగ్గినప్పుడు సులువుగా బయటికి వచ్చేలా చేస్తుంది.
అంబ్రోక్సల్ అనేది ఎక్స్‌పెక్టోరెంట్స్ ఔషధాల తరగతికి చెందినది. ( కఫంతో కూడిన దగ్గును తగ్గించేందుకు సహకరిస్తుంది) లేదా కఫాన్ని కరిగించునది (కఫాన్ని ద్రవీకరించి తగ్గేలా చేస్తుంది). ఇది చిక్కటి శ్లేష్మాన్ని ద్రవరూపంలోకి మార్చి తేలికగా బయటకు వెళ్లిపోయేందుకు సహకరిస్తుంది. ఇది సర్ఫాక్టెంట్ అనే రసాయనం ఉత్పత్తికి దోహదపడుతుంది. సర్ఫాక్టెంట్ శ్వాసనాళ గోడలకు కఫం అతుక్కునిపోకుండా చేసి దగ్గినపుడు తేలికగా బయటకు పోయేలా చేస్తుంది.
Common side effects of Ambroxol
వికారం, వాంతులు, పొట్టలో గందరగోళం
Ambroxol మెడిసిన్ అందుబాటు కోసం
Ambroxol నిపుణుల సలహా
- మీరు చర్మం తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యల (స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ లేదా లెయెల్ సిండ్రోమ్) చరిత్ర కలిగి ఉంటే అంబ్రోక్సిల్ తీసుకునే ముందు వైద్యుని సంప్రదించండి..
- చర్మ లేదా ముకోసా ( ముక్కు, నోరు, ఊపిరితిత్తులు లోపలి వైపు మరియు మూత్ర మరియు జీర్ణ మార్గములో ఉండే తేమ కణజాలం) కు హాని గమనిస్తే ఔషధాన్ని ఉపయోగించటం మాని వెంటనే వైద్యుని సంప్రదించండి..
- అంబ్రోక్సిల్ తీసుకుంటుంటే దగ్గును అణిచివేసే మందులు (యాన్టిట్యూస్సివ్స్) వాడటం మానండి.
- మీరు గర్భవతులు అయినా లేదా గర్భం ధరించే ప్రణాళిక ఉన్నా అంబ్రోక్సిల్ తీసుకునే ముందు వైద్యుని సంప్రదించండి.
- మీరు చనుబాలు ఇస్తుంటే అంబ్రోక్సిల్ తీసుకునే ముందు వైద్యుని సంప్రదించండి.
- అంబ్రోక్సిల్ తీసుకునే ముందు మీకు ఇవి ఉంటే వైద్యుని సంప్రదించండి.
- తీవ్ర కాలేయ లేదా మూత్రపిండాల సమస్యలు. మీకు మోతాదు తగ్గించటం లేదా మోతాదు యొక్క విరామం పొడిగించటం అవసరం కావచ్చు.
- సిలియారీ డీస్కిన్ఇసియా అనే వ్యాధిలో వాయుమార్గం లోని జుట్టు లాంటి నిర్మాణాలు సరిగా లేక శ్లేష్మం ను తొలగించటంలో సహాయం చెయ్యలేవు.